Monday, December 23, 2024

రైలు పట్టాలపై ఇద్దరి మృతదేహాలు..

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్‌:రైలు పట్టాలపై ఇద్దరు విగతజీవులుగా మారిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..రైల్వే పోలీసుల కథనం ప్రకారం శనివారం ఉదయం ఆర్.యూ.బి కింద 437/31 మైలు రాయి వద్ద ఆప్ లైన్‌లో రైలు పట్టాలపై ఇద్దరి మృతదేహాలను గుర్తు పట్టని స్థితిలో చిద్రమై ఉండగా రైల్వే పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఒక ఆడ, ఒక మగ మృతదేహాలుగా గుర్తించారు.

కాగా వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా.. లేదా రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఉంటుందా..ఏదైనా రైలు నుంచి జారీ పడి మరణించి ఉంటారా అనే కోణంలో రైల్వే పోలీసులు విఛారిస్తున్నారు. ముఖ్యంగా మృతుల వివరాలు తెలిస్తే కాని వారి ఎలా చనిపోయారనే విషయం కూడా స్పష్టం అయ్యే అవకాశం ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మృతి చెందిన విషయం తెలుసుకున్న స్ఠానికలు పెద్దెత్తున ఘటన స్థలికి చేరుకుని మృతులను గుర్తించే ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను మార్చూరికి తరలించి మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News