Monday, December 23, 2024

గంజాయి కేసులో ఇద్దరు వ్యక్తుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : గంజాయి ప్యాకెట్లను అమ్మడానికి తెచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ అన్నారం రోడ్డులోని కిరాణం మర్చంట్ వెల్ఫేర్ ఫంక్షన్ హాల్ వద్ద ఎస్‌ఐ గండ్రాతి సతీశ్ తన సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న శివరాత్రి అనిల్, చార్ల గణేశ్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని పట్టుకొని పరిశీలించగా వారి దగ్గర ఎండు గంజాయి ప్యాకెట్లు లభించాయి.

ఇద్దరు వ్యక్తులను విచారించగా విశాఖపట్నం జిల్లా నుండి గంజాయి కొనుగోలు చేసి తొర్రూరులో అమ్మడానికి వచ్చినట్లు తెలిపారని సీఐ తెలిపారు. వారి వద్ద నుండి నాలుగు కిలోల ఎండు గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఎవరైనా నిషేధిత వస్తువులు అమ్మినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News