Monday, November 18, 2024

ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కామ్… హోటల్ వ్యాపారి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : రూ.2000 కోట్ల భారీ లిక్కర్ సిండికేట్ స్కామ్‌తో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా గిరిరాజ్ హోటల్ ప్రొమోటర్ నితేష్ పురోహిత్‌ను బుధవారం మధ్యాహ్నం అరెస్టు చేసింది. ఈ కేసులో అరెస్టయిన మూడో వ్యక్తి పురోహిత్. రాయ్‌పూర్ మేయర్, కాంగ్రెస్ నాయకుడు అయిజాజ్ ధేబర్ పెద్ద సోదరుడు అన్వర్ ధేబర్ మొదట గతవారం అరెస్టు అయ్యారు. అన్వర్ దేబర్ అక్రమ లావాదేవీలన్నీ పురోహిత్‌కు బాగా తెలుసని, బుధ్ధిపూర్వకంగానే ఈ నేరాలు సాగించడంలో మరో వ్యక్తి ఐఎస్ ఆఫీసర్ చత్తీస్‌గఢ్ క్యాడర్ అనిల్ తుతేజాకు సహకరించినట్టు ఈడీ ఆరోపించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పిఎంఎల్‌ఎ) కింద దేబర్‌ను తన నాలుగు రోజుల రిమాండ్ పూర్తయిన తరువాత బుధవారం కోర్టులో హాజరు పరచగా కోర్టు మరో ఐదు రోజులు కస్టడీని పొడిగించింది.

అయితే నిందితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వేధింపులకు గురికాకూడదని, అలా జరగలేదని నిర్ధారించడానికి వీలుగా దర్యాప్తు సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని అడిషనల్ జిల్లా , సెషన్స్ జడ్జి అజయ్ సింగ్ రాజ్‌పుట్ ఈడీకి ఆదేశించారు. రోజూ నిందితుడిని కలుసుకోడానికి తనకు కోర్టు అనుమతించిందని నిందితుని తరఫు న్యాయవాది రాహుల్ త్యాగి చెప్పారు. విక్రయించే ప్రతి లిక్కర్ బాటిల్ నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేయడమైందని, అన్వర్ దేబర్ నేతృత్వంలో సాగిన ఈ వ్యవహారంలో అనూహ్యమైన అవినీతి, మనీ లాండరింగ్ రూ. 2000 కోట్ల వరకు సాగిందని ఈడీ ఆరోపించింది. 2022 లో అప్పటి ఐఎఎస్ ఆఫీసర్ అనిల్ తుతేజాకు వ్యతిరేకంగా ఆదాయం పన్ను విభాగం చార్జిషీట్ దాఖలు చేసినప్పుడు మనీలాండరింగ్ కేసు వెలుగు లోకి వచ్చింది. అనిల్ తుతేజీ, మిగతా నిందితులు ఢిల్లీ కోర్టులో కూడా హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News