Monday, December 23, 2024

బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. హైదరాబాద్,చంపాపేటకు చెందిన యశ్వంత్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు, ప్రవీణ్‌కుమార్ వ్యాపారం చేస్తున్నాడు, మియాపూర్‌కు చెందిన ప్రవీణ్ ప్రధాన బూకీ. ప్రధాన నిందితుడు ప్రసాద్ పరారీలో ఉన్నాడు. చంపాపేటకు చెందిన ఇద్దరు నిందితులు మెయిన్ బూకీ ప్రసాద్ సాయంతో ఎంపి కింగ్,

గో ఎక్స్చెంజ్ తదితర యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వాటి ద్వారా బెట్టింగ్ కట్టే వారికి యూజర్ ఐటి, పాస్‌వర్డ్ ఇచ్చే వారు. దాని ద్వారా యువకులు బెట్టింగ్ కడుతున్నారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఇద్దరు వ్యక్తులు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీరు బెట్టింగ్ నిర్వహిస్తున్న విషయం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ఐఎస్ సదన్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News