Sunday, December 22, 2024

గుండెపోటుతో ఇద్దరు మృతి..

- Advertisement -
- Advertisement -

నాగిరెడ్డిపేట్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని చీనూర్ సర్పంచ్ సౌంధర్య భర్త మాసగళ్ల లక్ష్మీనారాయణ 33, నాగిరెడ్డిపేటకు చెందిన మట్టమల్ల పోచయ్య 60 ఇద్దరు బుధవారం ఒకే రోజు గుండెపోటుతో మరణించడంతో రెండు గ్రామాలలో విశాదఛాయలు అలుముకున్నాయి. బుధవారం హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లిన లక్ష్మీనారాయణ చికిత్స పొందుతూ మృతి చెందారు.

నాగిరెడ్డిపేట్ కు చెందిన మట్టమల్ల పోచయ్య మెదక్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గుండెపోటుతో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురెందర్ పరామర్శించి అంత్యక్రిల్లో పాల్గొన్నారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు,నాయకులు ఉన్నారు.
గుండెపోటు మరణాలతో ప్రజల్లో ఆందోళన..
నాగిరెడ్డిపేట్ మండలంలో గుండెపోటుతో మరణాలు సంభవించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గంతంలో ఇంతలా గుండెపోటు మరణాలు సంభవించేవి కాదని ప్రజలు చెబుతున్నారు. రెండు నెలల క్రితం మండలంలోని లింగంపల్లి గ్రామ సర్పంచ్ మానవ, కిషన్‌గౌడ్ లు గుండెపోటుతో మృతి చెందారు. ఇంలాంటి ఘటనలతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మండలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి 20 మంది వరకు ఛాతిలో నొప్పి సమస్యతో వచ్చినట్లు డాక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News