Sunday, January 19, 2025

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

పినపాక: ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన పినపాక మండల పరిధిలోని అక్కినేపల్లి గ్రామ ప్రధాన రహదారిపై గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామానికి చెందిన పిట్ట వీరరాజిరెడ్డి(45), వెంకట సాయిరెడ్డి (20) కుటుంబ సభ్యులతో కలిసి వాజేడు మండలం చింతూరు గ్రామంలోని దుర్గమ్మ దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అక్కినేపల్లి మల్లారం దగ్గర మణుగూరు నుండి ఇసుక లారీ వరంగల్ వెళ్తుతున్న క్రమంలో టూ వీలరని ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఘటన స్ధలానికి చేరుకున్న ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు సిఐ రాజగోపాల్‌ను ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను ప్రైవేటు వాహనంలో మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్ధలంలో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.

మధ్య తరగతి కుటుంబలో విషాదం……
ప్రమాదంలో మృతి చెందిన ఇరువురి కుటుంబాలు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. రోజు వారి పనులకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. పిట్ట వీరరాజురెడ్డి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. అతనికి భార్యతో పాటు పెళ్లీడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తండ్రి మృతి చెండడంతో ఆడపిల్లల రోదనలు పలువురిని కలిచివేశాయి. చేతి కందిన కొడుకు రెక్క వెంకటసాయిరెడ్డి మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ చదివించుకుంటున్న కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబాలలో విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News