Sunday, December 22, 2024

కారులో మంటలు చెలరేగి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

భువనగిరి క్రైమ్: కారు, టివిఎస్ లునాలు ఢీకొని కారులో భారీగా మంటలు చేలరేగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజపేట మండలం నమిలే గ్రామానికి చెందిన భువనగిరి మైసయ్య(60), ఎర్ర శంకరయ్య (65) ఇద్దరు టివిఎస్‌ఎస్ వాహనంపై నమిలి నుంచి వెంకటాపూర్ గ్రామానికి వస్తుండగా అదే సమయంలో హైదరాబాదు నుంచి యాదగిరిగుట్టకు వెళ్తున్న ఎర్టిగా కారు ఢీకొట్టడంతో భువనగిరి మైసయ్య సంఘటన స్థలంలోని మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన ఎర్ర శంకరయ్యను బాటసారులు హుటా హుటిన వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

ఆస్పత్రికి చేరకముందే ఎర్ర శంకరయ్య బాడీ 80% శాతం కాలిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కారు, టీవీఎస్ వాహనం ఢీకొట్టడంతో కారు, టీవీఎస్ వాహనం రెండు పూర్తిగా మంటలు చెలరేగి రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. స్థానికులు ఫైర్ ఇంజన్ సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకొని ఫైర్ ఇంజన్ వాహన సిబ్బంది మంటలు ఆర్పారు. అదేవిధంగా స్థానిక పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని, అక్కడి విచారణ చేపట్టి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పిదప ఎస్త్స్ర రాఘవేందర్ గౌడ్ కేసు నమోదు చేసుకుని శవాలను భువనగిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News