Saturday, January 11, 2025

రైలుకు ఢీకొని ఇద్దరు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు రైలుకు ఢీకొని దుర్మరణం చెందిన సంఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది. వివరాలలోకి వెళితే.. కామారెడ్డి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టలో భార్య పిల్లలతో కలిసి నివాసముంటున్న బ్రాహ్మణపల్లికి చెందిన ఇప్పలపల్లి యాదగిరి(38) రెండు రోజుల క్రితం భార్యతో గొడవ పడి సొంత ఊరికి వచ్చాడు.

తాగిన మైకంలో ఉన్న యాదగిరి తూప్రాన్‌కు వెళ్లడానికి బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్ పట్టాలను దాటుతున్న క్రమంలో రైలు ఢీకొని మృతిచెందాడు. శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన నీరుడి ప్రవీణ్(22) పని పాటా లేకుండా తిరుగుతున్నావని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై  రైలు కిందపడి  ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్‌ఐ తావు నాయక్ తెలిపారు. ఈ రెండు ప్రమాదాలు రైలు పట్టాలపై వంద మీటర్ల దూరంలో జరగడం గమనార్హం. ఈ సంఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాయక్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News