Sunday, December 22, 2024

కాకతీయ కెనాల్‌లో స్నానానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతు

- Advertisement -
- Advertisement -

మెండోరా ః మండల కేంద్రంలో గల కాకతీయ కెనాల్‌లో శుక్రవారం సాయంత్రం సుమారు 4.30 గంటల ప్రాంతంలో నిజామాబాద్ పట్టణంలోని గాయత్రీనగర్‌కి చెందిన చింటూ, వేణు, ప్రణవ్‌లు మెండోరా గ్రామానికి చెందిన స్నేహితుడు నోముల పవిత్‌రెడ్డి వద్దకు వచ్చి మెండోరా గ్రామంలో గల పెద్దమ్మ గుడి వద్ద స్నానానికి నలుగురు దిగగా అందులో నిజామాబాద్ గాయత్రీ నగర్‌కి చెందిన చింటూ అనే యువకుడు మరియు పవిత్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు.

గాయత్రీ నగర్‌కి చెందిన ప్రణవ్, వేణులు గల్లంతయ్యారని ఎస్సై జి.శ్రీనివాస్ తెలిపారు. గల్లంతైన వ్యక్తుల కొరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు అధికారులకు నీటి విడుదలను తగ్గించామని ఎస్సై కోరగా నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి నీటిని తగ్గించారని ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News