Thursday, January 23, 2025

వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిప్పర్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా దూసుకు వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో దానిపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం…కూకట్‌పల్లికి చెందిన సతీష్, వీరబాబు ఇటుకల లోడ్‌ను ఖాళీ చేసేందుకు వనస్థలిపురానికి వెళ్లారు. బైక్‌పై ఉండగా వనస్థలిపురం సుష్మా థియేటర్ వద్ద వేగంగా వచ్చిన టిప్పర్ అదుపు తప్పి బైక్‌పైకి వెళ్లింది. దీంతో బైక్‌పు న్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News