Monday, December 23, 2024

తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిపారన్న చంద్రబాబు నాయుడు ఆరోపణ దుమారం రేపుతోంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా దీనిపై సిట్ సమగ్ర విచారణ జరుపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత వివాదం సుప్రీంకోర్టుకు చేరుకుంది. సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకటి బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి వేయగా, మరోటి వైసిపి నేత వైవి. సుబ్బా రెడ్డి వేశారు.

తిరుమల లడ్డుపై సిఎం చంద్రబాబు నాయుడు చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై విచారణ చేపట్టాలని సుబ్రహ్మణ్యస్వామి కోరుతూ పిల్ వేశారు. వైవి. సుబ్బారెడ్డి కూడా విచారణ కోరతూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా హైకోర్టు కూడా వైవి.సుబ్బారెడ్డి పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఇదిలా వుండగా సుబ్రహ్మణ్య స్వామి, వైవి.సుబ్బారెడ్డి పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి విచారణ చేపడుతుందో వేచి చూడాల్సిందే. ఏదిఏమైనప్పటికీ తిరుపతి లడ్డు శుద్ధత హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నిత అంశం. కనుక నిజాలు నిగ్గు తేలాల్సిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News