Sunday, December 22, 2024

హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్లకు గాయాలు

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో శుక్రవారం ల్యాండిగంవ చేస్తున్న సమయంలో ఒక హెలికాప్టర్ అదుపుతప్పి కూలిపోగా ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. శివసేన(యుబిటి) నాయకురాలు సుష్మా అంధారేను పికప్ చేసుకుని ఒక ఎన్నికల ప్రచార సభకు తీసుకెళ్లే సందర్భంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మహూహద్ వద్ద నిర్మించిన ఒక తాత్కాలిక హెలిపాడ్‌పైన హెలికాప్టర్‌ను ల్యాండ్ చేస్తుండగా అది పక్కకు ఒరిగిపోయి పైలట్లు గాయపడ్డారు.

ఈ సందర్భంగా హెలికాప్టర్‌పైన ఫ్యాన్లు కూడా దెబ్బతిన్నాయి. ల్యాండింగ్ అవుతున్న సమయంలో హెలికాప్టర్ అదుపు తప్పినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. భారీ శబ్దంతో హెలికాప్టర్ పక్కకు ఒరిగిపోగా దట్టమైన దుమ్ము గాలిలోకి ఎగసింది. ఘంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థిలిని చేరుకుని పైలట్లకు ప్రథమ చికిత్సను అందచేశాయి. రాయగడ్ లోక్‌సభ నియోజకవర్గానికి మే 7న మూడవ దశలో పోలింగ్ జరగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News