Monday, November 18, 2024

చికాగో విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ.. ఎఫ్‌ఎఎపై దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

చికాగో : చికాగో లోని ఓ హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం రెండు బోయింగ్ విమానాలు ఢీకొన్నాయి. అయితే ఎవరూ ఈ సంఘటనలో గాయపడలేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎఎ) సోమవారం వెల్లడించింది. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జపాన్ ఆల్‌నిప్పన్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం బయలుదేరబోతుండగా, ఎడమ రెక్క చివర భాగం, డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం 2122 వెనుక భాగాన్ని ఢీకొట్టిందని ఎఫ్‌ఎఎ అధికార ప్రతినిధి టోనీ మొలినారో చెప్పారు.

ఈ రెండు విమానాలు బోయింగ్ విమానం మోడల్‌వే. దీంతో అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ తాను తయారు చేసిన బోయింగ్ విమానాలకు సాంకేతిక లోపాలతో తరచుగా ప్రమాదాలకు గురికావడంతో ఎఫ్‌ఎఎ దర్యాప్తును ఆ సంస్థ ఎదుర్కోవలసి వస్తుంది. గత వారం బోయింగ్ 737 మాక్స్ 9 మోడల్ విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ విఫలం కావడంతో అత్యవసరంగా కిందకు దించవలసి వచ్చింది.

అయితే ఆదివారం సంఘటనకు సంస్థ తయారీ లోపమా మరేదైనా కారణమా అన్నది వెంటనే తెలియరాలేదు. డెట్రాయిట్ నుంచి డెల్టా విమానం చికాగో విమానాశ్రయానికి వచ్చిన తరువాత గేట్ దగ్గర పార్కింగ్ అయి ఉండగా, ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ విమానం డెల్టా విమానాన్ని వెనుకనుంచి ఢీకొట్టిందని డెల్టా అధికార ప్రతినిధి ఎమ్మా జాన్సన్ సోమవారం మధ్యాహ్నం ఫోన్ ద్వారా తెలియజేశారు. సాధారణంగా కస్టమర్లు గేట్ దగ్గర విమానం నుంచి దిగుతారని , డెల్టా నిర్వహణ సాంకేతిక బృందం విమానాన్ని పర్యవేక్షిస్తారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News