Thursday, January 23, 2025

ఒకే రన్ వేపై రెండు విమానాలు…తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ముంబై: ఎయిర్ ఇండియా విమానానికి ముంబైలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. రన్ వే పై ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతుండగా…ఊహించని విధంగా అదే రన్ వే పై ఇండిగో విమానం ల్యాండ్ అయింది. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రమాదం జరిగి ఉండేదే.

ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఏ) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని సస్పెండ్ చేశారు. అయినా ఒకే రన్ వే పై రెండు విమానాలు కదలడం ఏమిటి? టెక్నికల్ ప్రాబ్లమ్ ఏదైనా వస్తే…లేకుంటే కంట్రోల్ కాకుంటే.. ప్రమాదం జరిగి ఉండేదే కదా? ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News