Thursday, January 23, 2025

మహిళా ఎస్‌ఐకి వేధింపులు: ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

లక్నో: మహిళా ఎస్‌ఐపై అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని చందౌసి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బుధవారం (సెప్టెంబర్ 20) విధులు ముగించుకుని ఇంటికి తిరిగివెళుతున్న ఒక మహిళా ఎస్‌ఐని కారులో వెంబడించిన ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ ఆమె పట్ల అమర్యాదకరంగా ప్రవర్థించారని సర్కిల్ అధికారి దీప్ కుమార్ గురువారం తెలిపారు. పవన్ చౌదరి, రవీంద్ర అనే ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ఆమెను దూషించడమేకాకుండా బెదిరించారని ఆయన చెప్పారు.

మహిళా ఎస్‌ఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్‌పై ఐపిసిలోని సెక్షన్ 354, 341 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్‌పి కుల్దీప్ సింగ్ గునవాత్ ఉత్తర్వులు జారీచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News