Monday, January 20, 2025

నటి జత్వాని కేసు.. ఇద్దరు పోలీసులపై వేటు

- Advertisement -
- Advertisement -

ఎపిలో సంచలనం సృష్టించిన సినీ నటి కాదంబరి జత్వాని కేసులో ఇద్దరు పోలీసులపై వేటు పడింది. ఎసిపి హనుమంతరావు, సిఐ సత్యనారాయణలను డిజిపి ద్వారకా తిరుమలరావు సస్పెండ్ చేశారు. వైసిపి ప్రభుత్వంలో తనను అక్రమంగా అరెస్ట్‌ చేసి వేధించారని ఆరోపిస్తూ నటి జత్వాని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

జత్వానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్పట్లో ఈ కేసును డీల్ చేసిన ఎసిపి హనుమంతరావు, సత్యనారాయణలు నటి జత్వానీని వేధించారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరిని డిజిపి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మరికొంత మంది పోలీసుల పాత్ర కూడా ఉందని.. వారిపై కూడా చర్యలు తీసుకుంటారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News