Friday, December 20, 2024

మందుపాతర పేలి ఇద్దరు పోలీసులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

Two policemen were injured in landmine blast

 

నారాయణ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో మంగళవారం నక్సల్స్ అమర్చిన మందుపాతరలు పేలి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు(డిఆర్‌జి)కు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ గాయపడ్డారు. కురుస్నర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉదయం 9.15 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. డిఆర్‌జి, ఇండో–టిబెటన్ బార్డర్ పోలీసు ఆ ప్రాంతంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు జిల్లా ఎస్‌పి సదానంద్ కుమార్ తెలిపారు. గాయపడిన పోలీసులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నట్లు ఆయన చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు. వారిని సనవ్ వడ్డే, రాంజీ పొటాయిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News