హైదరాబాద్ : నగరంలోని మలక్‌పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఇద్దరు బాలింతలు వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోవడం అత్యంత దారుణమని, ఇది మనసును కలిచివేస్తున్నదని టిటిడిపి రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాదుకు చెందిన శివాని అనే గర్భిణికి డెంగ్యూ, బిపి ఉన్నప్పటికి తగిన వైద్య పరీక్షలు చేయకుండ వైద్యులు ఆపరేషన్ చేయడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమై మరణించినట్లు తెలుస్తోందన్నారు. అలాగే నాగర్ కర్నూలుకు చెందిన మరో గర్భిణి సిరివెన్నెలకు సైతం డెంగ్యూ ఉన్నప్పటికి.. దాన్ని గుర్తించకుండా వైద్యులు నిర్లక్ష్యంతో డెలివరీ చేయడంతో ఆమె ఫ్లెట్ లెట్స్ పడిపోయి మరణించిందన్నారు.
ఈ ఇద్దరు బాలింతలు వైద్యుల నిర్లక్ష్యం వల్ల మరణించడాన్ని టిడిపి తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. ఇద్దరి మహిళల ప్రాణాలను బలి పెట్టిన ఈ ఘోర ఘటనకు ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ జరిపించి బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మృతి చెందిన బాలింతల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం తో పాటుగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబులు బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇద్దరు బాలింతల మృతి దారుణం: కాసాని జ్ఞానేశ్వర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -