Wednesday, January 22, 2025

బైక్‌పై వెళుతున్న పోలీసులకు మాంజా కోసుకొని గాయాలు!

- Advertisement -
- Advertisement -

పుణె: ఇద్దరు పోలీసులు ఆదివారం బైక్‌పై పుణె సతారా రోడ్డులో వెళుతుండగా వారికి ఓ గాలిపటం ‘మాంజా’ చుట్టుకుంది. అంతే…శివాజీనగర్ పోలీస్ హెడ్‌క్వాటర్స్‌కు చెందిన పోలీసులు మహేశ్ పవార్, సునీల్ గావ్లీ మెడకు, చేతులకు గాయాలయ్యాయి. సాయంత్రం 4.30 గంటలకు ఈ ఘటన జరిగిందని పక్షుల ప్రేమికుడు, సంరక్షకుడు అయిన బాలాసాహెబ్ ధామలే తెలిపారు. అప్పుడు ఆయన అదే బ్రిడ్జి గుండా వెళ్లారు. ‘ఆ ఇద్దరు పోలీసులు ద్విచక్రవాహనంపై శంకర్ మహారాజ్ బ్రిడ్జి గుండా శివాజీనగర్ వైపు వెళ్లారు. మాంజా వారి మెడకు చుట్టుకోవడంతో వారికి గాయాలయ్యాయి. ఒక పోలీసుకైతే గొంతు కూడా కోసుకుపోయింది. అతడిని వెంటనే ఆటోలో చికిత్స కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అతడితోపాటు ఉన్న మరో పోలీసు చేతికి గాయాలయ్యాయి’ అని ధామలే తెలిపారు.

పుణెలో నిషిద్ధ నైలాన్ పతంగి మాంజాను అమ్ముతున్న వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని పుణె సిటీ పోలీస్ హెచ్చరించడమే కాక చర్యలకు దిగారు. గత రెండు వారాల్లో నలుగురిని మాత్రమే అరెస్టు చేశారు. నిషిద్ధ పతంగి దారాలు అమ్ముతున్న వారిపై చర్యలు కూడా చేపడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News