Wednesday, January 22, 2025

గోదావరిలో చిక్కుకున్న గొర్ల కాపర్లు

- Advertisement -
- Advertisement -

లక్ష్మణచాంద: రోజు లాగే గొర్లు మేపడానికి వెళ్లిన ఇద్దరు గొర్ల కాపర్లు గుగ్లోత్ లాలు, కందకూరు ముత్తన్నలు అనుకొని పరిస్థితిలో గోదావరిలో చిక్కుకొని రాత్రంత్రా అక్కడే బస చేసిన సంఘటన లక్ష్మణచాంద మండలంలోని పార్‌పెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీ కాంత్, గ్రామస్తుల వివరాల ప్రకారం … పార్‌పెల్లి గ్రామంలోని స్థానిక గోదావరి మధ్యలో గల ఒడ్డు భాగం ( కుర్రు)లో గొర్లు మేపడానికి వెళ్లారని, అత్యవసర సమయంలో ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ అధికారులు నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా ఒక్కసారిగా గోదావరి ప్రవాహం పెరిగింది.

దీంతో గొర్ల కాపర్లు ఉన్న ఒడ్డు చుట్టురా గోదావరి నీరు భారీగా చేరడంతో చేసేదేమి లేక రాత్రాంత అక్కడే గడిపారు.ఉదయం విషయం తెలుసుకున్నా సర్పంచ్ నూకల రాజేంధర్ సహకారంతో ఎస్సై శ్రీ కాంత్‌లు దగ్గరుండి గొర్ల కాపర్లను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. గ్రామంలోని స్థానికుల సహయంతో చెక్కల పడవ తో గొర్ల కాపర్లను బయటకు తీసుకొచ్చామని వారి ప్రాణాలను ఎలాంటి హాని కలుగకుండా క్షేమంగా ఒడ్డుకు చేరారన్నారు. అక్కడే ఉన్న గొర్లను వరద నీటి ప్రహవం తగ్గినాక బయటకు తీసుకొస్తామని గ్రామస్తులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News