Friday, December 27, 2024

జాతీయ స్థాయి ఎన్నికల్లో ఇద్దరు సింగరేణి ఉద్యోగుల గెలుపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి ఎన్నికల్లో సింగరేణి సత్తా చాటింది. ఈ మేరకు సింగరేణి బ్రాంచ్ ప్రతినిధులు బలపరిచిన బ్లాక్ డైమండ్ పానెల్ సంపూర్ణ విజయం సాధించింది. నాగ్‌పూర్‌లో హోరాహోరీగా జరిగిన అపెక్స్‌బాడీ ఎన్నికల్లో అధ్యక్షులుగా డిఎన్. సింగ్ జనరల్ సెక్రటరీగా. సర్వేష్ సింగ్ ఎంపిక కాగా ఈ ప్యానల్ నుంచి పోటీ చేసిన సింగరేణి అధికారుల సంఘం నేతలు ఎవి.రెడ్డి సీనియర్ వైస్ ప్రసిడెంట్ గాను, పి.రాజీవ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్‌గాను కేంద్ర కమిటీకి ఎంపికయ్యారు.

ఈ విధంగా కేంద్ర సంఘంలో ఇద్దరు నాయకులు ఒకే సారిగా ఎంపిక కావడం గమనార్హం. కొత్తగా ఎంపికైన కేంద్ర కోల్‌మైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నాయకత్వానికి , సింగరేణి నుంచి కీలక పోస్టులకు ఎంపికైన ఎవి. రెడ్డి,రాజీవ్ కుమార్‌లకు కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి బ్రాంచ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జక్కం రమేష్, ఎన్‌వి. రాజశేఖర్ రావులు తమ అభినందనలు తెలియజేశారు.

Two Singareni workers win in national level elections

జాతీయ స్థాయి ఎన్నిక ప్రక్రియ ఇలా..

బొగ్గు పరిశ్రమల్లో పని చేసే అధికారుల సమస్యల పరిష్కారం కోసం మూడు దశాబ్దాల క్రితం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను అధికారులు స్థాపించుకున్నారు.దీనిలో కోలిండియా అనుబంధ ఎనిమిది కంపెనీలకు చెందిన 16 వేల మంది అధికారులు , సింగరేణి సంస్థలో పని చేసే 2 వేల మంది అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘం ప్రధానంగా అధికారుల జీతభత్యాలు, ప్రమోషన్లు తదితర సమస్యలను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలకు తదితర సమస్యలను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు కోల్ ఇండియా , సింగరేణి యాజమాన్యాలకు నివేదిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటుంది.

ప్రజాస్వామ్య విధంగా జరిగే ఈ సంఘం ఎన్నికలను ముందుగా కంపెనీల వారీగా నిర్వహిస్తారు. కంపెనీ స్థాయి అధికారుల సంఘం కమిటీలను ఎంపిక చేసిన తర్వాత జాతీయ స్థాయి కమిటీని మూడేళ్లకు ఒకసారి ఎన్నుకుంటూ ఉంటారు. ప్రతి వంద మంది అధికారులకు ప్రాతినిధ్యం వహించేలా ఒక అధికారి చొప్పున ఎన్నుకొని కేంద్ర కమిటీ ( అపెక్స్ బాడీ) ఎన్నికల ఓటర్ల జాబితాలో స్థానం కల్పిస్తారు. ఈ ఓటర్లు కేంద్ర కమిటీని ఎన్నుకుంటారు. ఇలా ఈ ఏడాది కూడా ఇదే ప్రక్రియలో కేంద్ర కమిటీ ఎంపిక జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News