Thursday, November 21, 2024

తెలంగాణలో పది మంది ఓటర్ల కోసం రెండు పోలింగ్ బూత్ లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతి ఓటుకు విలువ ఇవ్వాలన్న లక్ష్యంతో ఎన్నిలక సంఘం అతి పిన్న అనుబంధ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసింది. ఇది వరలోనైతే కొన్ని ప్రాంతాల్లో 20 కిమీ. దూరం వెళ్లి ఓటేయాల్సి వచ్చేది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో మార్పులు తెచ్చారు.

నాగర్ కర్నూల్ లోని అచ్చంపేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్లాపూర్ ‘పెంట’ వద్ద కేవలం 10 మంది ఓటర్ల కోసం అనుబంధ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా నలగొండలోని దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బుదిద్ గట్టులోని అంగన్ వాడీ కేంద్రంలో అనుబంధ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఓటర్లు పది మందే.

తెలంగాణలోని నాగర్ కర్నూల్, నల్గొండ, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మొత్తంగా 10 అతి పిన్న పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.  ఈ పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల సంఖ్య 10 నుంచి 26 మందే. వీరిలో చాలావరకు ఎస్టీలు, చెంచులు, లంబాడీలు, కోయ జాతికి చెందిన వారు.  ఇదివరలో వీరు మూడు నుంచి 20 కిమీ. దూరం వరకు వెళ్లి ఓటేసేవారు.

రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు మే 13 న పోలింగ్ జరుగనున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News