Monday, December 23, 2024

మాదకద్రవ్యాలు, నగదుతో ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలోని రాచకొండ పోలీస్ మంగళవారం అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించింది, ఇద్దరు మాదకద్రవ్య అక్రమ రవాణాదారులను(డ్రగ్ పెడ్లర్స్) అరెస్టు చేసింది. 8.5 కిలోల సూడోఫెడ్రైన్(నార్కొటిక్ కంట్రోల్ సబ్టాన్స్) కన్సైన్‌మెంటును నిందితులు ముహమ్మద్ కాసీమ్, రసూలుద్దీన్ నుంచి స్వాధీనం చేసుకుంది. ఈ మాదకద్రవ్యంతో పాటు వారి నుంచి నగదు, ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకుంది. వారి నుంచి స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ తొమ్మిది కోట్ల రూపాయల మేరకు ఉంటుందని అంచనా.

తమిళనాడులోని స్మగ్లింగ్ గ్యాంగ్‌లు పుణే, హైదరాబాద్ కార్గో రూట్‌ను తమ డ్రగ్ స్మగ్లింగ్ కోసం ఉపయోగించిందని పోలీసులు తెలిపారు. సూడోఫెడ్రైన్, ఇతర నిషేధిత మాదకద్రవ్యాల ఐటెమ్స్‌ను వారు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిసింది.“ వారు పుణే, హైదరాబాద్‌లోని అంతర్జాతీయ కొరియర్ సర్వీసుల ద్వారా డ్రగ్ పార్సల్స్‌ను బుక్‌చేసేవారు. సూడోఫెడ్రైన్‌ను బట్టల బాక్సుల్లో, గాజుల బాక్సుల్లో, బేబీ వేర్ గిఫ్ట్ పాక్స్ తదితరాలలో దాపెట్టి రవాణా చేసేవారు” అని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.

నిందితులు 70 కిలోల సూడోఫెడ్రైన్ 15 కన్‌సైన్‌మెంట్లను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు పంపినట్లు ఒప్పుకున్నారు. తమ పార్సిళ్లను స్మగ్లింగ్ చేయడానికి స్మగ్లర్లు స్థానికుల ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించారని కూడా పోలీసులు తెలిపారు.
“పట్టుబడ్డ ఆ ఇద్దరు డిసెంబర్ 11న హైదరాబాద్‌కు బస్సులో వచ్చారు. ఆ తర్వాత వారు లాడ్జిలో బస చేశారు. డ్రగ్స్‌ను ప్యాక్‌చేసి, రవాణా చేసేందుకు యత్నిస్తున్నప్పుడు వారిని పోలీసులు పట్టుకున్నారు. సూడోఫెడ్రైన్‌తో పాటు వారి నుంచి రూ. 4,02,500 నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నాము” అని భగవత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News