- Advertisement -
బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాప్ట్‌వేర్ ఉద్యోగులు మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం అర్ధరాత్రి 12ః30 గంటల సమయంలో ఆకాన్ష్ (24) అతని స్నేహితుడు రఘుబాబు ఇద్దరు కలిసి బోరబండ నుండి మాదాపూర్ వస్తున్న సమయంలో పర్వత్‌నగర్ సిగ్నల్ దాటిన తర్వాత బైక్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికి బలమైన గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం మాదాపూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆకాన్ష్ తండ్రి ముల్క కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
- Advertisement -