Wednesday, January 22, 2025

ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలి ఇద్దరు సైనికాధికారుల మృతి

- Advertisement -
- Advertisement -

Two soldiers were killed in an accidental grenade explosion

జమ్మూ: పూంచ్ జిల్లాలోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసి) వెంబడి మెంధర్ సెక్టార్‌లో ఆదివారం ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలుడు సంభవించి భారత సైన్యానికి చెందిన ఒక కెప్టెన్, మరో జూనియర్ కమిషన్డ్ అధికారి(జెసిఓ) మరణించారు. ఆదివారం రాత్రి భారత సైనిక దళాలు గస్తీ విధులలో ఉండగా ఈ పేలుడు సంభవించినట్లు రక్షణ శాఖ పిఆర్‌ఓ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ సోమవారం తెలిపారు. ఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ ఆనంద్, జెసిఓ నయిబ్ సుబేదార్ భగవాన్ సింగ్‌లను వెంటనే హెలికాప్టర్‌లో ఉధంపూర్‌లోని కమాండ్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారిద్దరూ మరణించారని ఆయన చెప్పారు. కెప్టెన్ ఆనంద్ స్వస్థలం బీహార్‌లోని భగల్‌పూర్ జిల్లా చంపా నగర్ కాగా భగవాన్ సింగ్‌ది ఉత్తర్‌ప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాని పోఖర్ భిట్టా గ్రామమని పిఆర్‌ఓ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News