Sunday, December 22, 2024

వికారాబాద్ లో రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Two spot dead in Road accident at Vikarabad

పూడూరు:  వికారాబాద్ జిల్లా పూడూరు మండలం బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఛీలాపూరు స్టేజి సమీపంలో ఉన్న పెట్రోల్ పంపు దగ్గర మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బొలెరో వాహనం బైకును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మేడికొండ గ్రామానికి చెందిన పి యాదిరెడ్డి (50), సాకలి రవి(32)లుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News