Monday, December 23, 2024

సావర్కర్ పోస్టర్ పై శివమొగ్గలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

 

Shivamogga clashes

శివమొగ్గ: స్వాతంత్ర్య దినోత్సవం రోజున శివమొగ్గలో ఓ గ్రూపుకు చెందిన యువకులు వీర సావర్కర్ పోస్టర్ను పెట్టగా, కొందరు ముస్లిం యువకులు అమీర్ అహ్మద్ సర్కిల్ లో టిప్పు సుల్తాన్ పోస్టర్ను పెట్టాలని చూశారు. దాంతో రెండు వర్గాల యువకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని వీరసావర్కర్ ఫోటోను తొలగించిన ఇద్దరిని అరెస్టు చేశారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వర్గీయులు నిరసన చేపట్టారు. పోలీసు బలగం అక్కడికి తరలింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఇదిలావుండగా రెండు వేర్వేరు ప్రాంతాలలో ప్రవీణ్, ప్రేమ్ సింగ్ అనే ఇద్దరు  కత్తిపోట్లకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు వారిపై దాడిచేశారు. కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News