Wednesday, April 2, 2025

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ మందుపాతర పేలి ఇద్దరు ఎస్‌టిఎఫ్ సిబ్బంది మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఐఇడి పేలుడులో ప్రత్యేక టాస్క్ ఫోర్సు(ఎస్‌టిఎఫ్)కు చెందిన ఇద్దరు సిబ్బంది మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. బుధవారం రాత్రి తర్కెం ప్రాంతలో ఈ ఘటన జరిగింది. బీజాపూర్-సుక్మా–దెంతెవాడ జిల్లాలకు చెందిన ట్రైజంక్షన్‌పై ఉన్న అడవులలో నక్సల్స్ కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎస్‌టిఎఫ్ సిబ్బంది తిరిగివస్తున్న సమయంలో నక్సలైట్లు అమర్చిన మందుపాతర పేలినట్లు పోలీసులు తెలిపారు.

నక్సలైట్లు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో వారి కోసం ఎస్‌టిఎఫ్ సిబ్బంది అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఐఇడి పేలుడులో రాయపూర్‌కు చెందిన భరత్ సాహు, నారాయణ్‌పూర్ జిల్లాకు చెందిన సత్యేర్ సింగ్ కాంగే మరణించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అదనపు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని గాయపడిన ఎస్‌టిఎఫ్ సిబ్బందిని బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపిన జవాన్లను మెరుగైన వైద్యం కోసం రాష్ట్ర రాజధాని రాయపూర్‌కు ఎయిర్‌లిఫ్ట్ చేస్తామని అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News