నలుగురు దుర్మరణం
యాదగిరిగుట్టలో విషాదం
మృతుల్లో ఇంటి యజమానితో
దుకాణం నడుపుకుంటున్న యువకుడు,
అతడి ఇద్దరు మిత్రులు ఒకరి పరిస్థితి
విషయం, పలువురికి గాయాలు.. అందరూ
స్థానికులే భవనం మొదటి అంతస్తు పోర్టికో
స్లాబ్ కూలడంతో ఘటన శిథిలాలు
తొలగింపు క్షతగాత్రులకు భువనగిరి
ఆస్పత్రిలో చికిత్సలు
మన తెలంగాణ/యాదగిరిగుట్ట: భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న శ్రీరాంనగర్‌లో ఈ ఘటన సంభవించింది. ప్రమాదం లో నలుగురు దుర్మరణం చెందారు. మృతు ల్లో ఇంటి యజమానితో దుకాణం న డుపుకుంటున్న యువకుడు, అతడి ఇద్దరి మి త్రులు మృతి చెందారు. మృతుల్లో భవన య జమాని గుండ్లపల్లి దశరథ గౌడ్ (85), అదే భవనంలో బట్టల దుకాణం నిర్వహిస్తున్న సుంచు శ్రీనివాస్ (40), అతని వద్దకు వచ్చిన ఇద్దరు మిత్రులు తంగలపల్లి శ్రీనాథ్(39) సుంకి ఉపేందర్(40) ఉన్నారు. దుకా ణం నడుపుకుంటున్న గిరి అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. గిరి పరిస్థితి విషమం గా ఉండడంతో చికిత్స నిమిత్తం భవనగిరి ఏ రియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదంలో భవనంలో నివాసం ఉంటున్నవారితోపాటు షాపుల వద్దకు వచ్చిన మరికొంతమందికి కూడా తరువాయి 6లో
కూలిన భవనం
మొదటిపేజీ తరువాయి
గాయాలయ్యాయి. సాయంత్రం మార్కెట్ రద్దీగా ఉండే సమయంలో ఒక్కసారిగా భవనం పోర్టికో స్లాబ్ కుప్పకూలడంతో సమీపంలోని వ్యాపారులు ఒక్కసారిగా భీతిల్లారు. భవనం కింద ఉన్న షాపుల వద్ద ఉన్న ఉన్న వినియోగదారులు ఈ ఘటనతో పరుగులు తీశారు. 35 సంవత్సరాల క్రితం నిర్మించిన రెండంతస్తుల భవనంలోపైన, వెనుక భాగంలో నివాసాలకు, కింద వాణిజ్య అవసరాల కోసం రెండు షాపులను ఏర్పాటు చేశారు. భవనం మొదటి అంతస్తులోని పోర్టికో ముందుభాగం ఒక్కసారిగా కుప్పకూలడంతో కింద షాపుల ముందుభాగంలో ఏర్పాటు చేసిన రేకుల షెడ్లతో సహ మొత్తం కుప్పకూలింది. సమాచారం అందుకుని ప్రమాదం సంఘటన వద్దకు చేరుకున్న ఎసిపి నర్సింహ్మరెడ్డి తోపాటు పోలీసులు శిథిలాల కింద చిక్కుకొని ఉన్న మృతులతోపాటు క్షతగాత్రులను జెసిపి సహాయంతో బైటకు తీశారు. పలువురు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఒకే ప్రమాదంలో యాదగిరిగుట్టకు చెందిన నలుగురు మృతి చెందడంతో పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.