Tuesday, January 21, 2025

దారుణ ఘటన.. కుక్కలను చంపి చెట్టుకు వేలాడదీశారు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 9లో బుధవారం రెండు కుక్కలు చనిపోయాయి. కుక్కలలో ఒకదాని మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించగా, మరొకటి గోడకు సమీపంలో పడి ఉంది. జంతు ప్రేమికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ద్వారకా పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 429 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు అధికారులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మరోవైపు కుక్కల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఈ దారుణ ఘటనపై ఓ అధికారి మాట్లాడుతూ… “ద్వారకలోని సెక్షన్ 9లోని ఏకాంత పార్కులో వీధికుక్కలను చంపడంపై ఫిర్యాదు అందింది. 2022 డిసెంబర్ 28వ తేదీ ఎఫ్‌ఐఆర్ నంబర్ 692/22 యు/ఎస్ 429 ఐపిసి, పిఎస్ ద్వారకా సౌత్ ఫిర్యాదుపై కేసు నమోదు చేయబడింది. కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల మూగజీవాల పట్ల కొంతమంది క్రూరంగా ప్రవర్తిస్తున్న ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News