Sunday, December 22, 2024

ఇద్దరు విద్యార్ధినులు అదృశ్యం

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరధిలోఇద్దరు విద్యార్ధినులు అదృశ్యమనై సంఘటన చోటుచేసుకుంది. బుధవారం రోజు మాదిరిగానే ఇంటి నుంచి పాఠశాలకు వెంల్లిన విద్యార్ధినిలుసాయంత్రం తిరిగి రాలేదు. కంగారు పడ్డ తల్లిదండ్రులు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగద్గిరిగుట్టకు చెందిన లక్మీ దుర్గా(13) హారికలు వివేకానందనగర్ లోని చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. బుధవారం స్కూల్‌కి వచ్చిన ఇద్దరు విద్యార్ధినిలు ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లక్మీదుర్గ, హారికలు స్కూల్ సమీపంలోని ఓ నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లి ముం దుగానే తెచ్చుకున్న బట్టలను మార్చుకున్నారు.

అక్కడి నుంచి ఇద్దరు బయటకు వెళ్లారు. ఇది ఇలా ఉండగా దుర్గ, హారికలు క్లాస్ రూంలో సూర్యలంక బీచ్‌కు వెళ్లినట్లు తెలిసింది. తరుచుగా సూర్యలంక బీచ్ కోసం మాట్లాడుకునేవారని తెలిసింది. అయితే ఇస్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ అబ్బాయి వీరికి తోడుగా ఉన్నట్లు సమాచారం. తోటి స్నేహితులకు అక్కడ దిన ఫో టోలు పెట్టడం ద్వారా స్పష్టమైంది. సూర్యలంక అన్న పోలీస్ స్టేషన్‌తో పాటుగా కూకట్‌పల్లి పోలీసులు విద్యార్ధినిల కోసం గాలిస్తున్నట్లు కూకట్‌పల్లి ఏసిపి శ్రీనివాస్‌రావు, సిఐ ముత్తులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News