Wednesday, January 22, 2025

24 గంటల్లో కోటాలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలు

- Advertisement -
- Advertisement -

అస్సాం నాగాఁవ్‌కు చెందిన ఒక విద్యార్థి బుధవారం రాజస్థాన్ కోటాలో ఆత్మహత్య చేసుకున్నాడు. పరాగ్‌గా గుర్తించిన విద్యార్థి మృతదేహాన్ని పట్టణంలోని మహావీర్ నగర్ ప్రాంతంలోని అతని ఇంటిలో కనుగొన్నారు. ఇది బుధవారం అటువంటి రెండవ దుర్ఘటన, ఈ నెలలో ఆరవది. విశ్వవిద్యాలయ పోటీ ప్రవేశ పరీక్షల్లో సాఫల్యం కోసం చూస్తున్న విద్యార్థుల ‘కేంద్రం’ కోటాలో మరొకసారి విద్యార్థుల ఆత్మహత్యల పరంపర సాగుతుందేమోననే భయాందోళనలను అవి రేకెత్తిస్తున్నాయి. బుధవారం కొన్ని గంటలకు ముందు నీట్ పరీక్షలకు చదివేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి కోటాకు వచ్చిన యువతి ఆఫ్షా షేఖ్ మృతదేహం జవహర్ నగర్‌లోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

దీనిపై పోస్ట్ మార్టమ్‌కు ఆదేశించినట్లు, ఆమె కుటుంబానికి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలియజేశారు. ఈ నెలలోనే మరి నలుగురు విద్యార్థుల ఆత్మహత్యల గురించి సమాచారం వచ్చింది. ఐఐటి జెఇఇ ప్రవేశ పరీక్ష కోసం చదువుకుంటున్న 19 ఏళ్ల నీరజ్ ఈ నెల 7న బలవన్మరణం చెందాడు. 24 గంటల తరువాత మరొక జెఇఇ అభ్యర్థి 20 ఏళ్ల అభిషేక్ మృతదేహం కనిపించింది. డాక్టర్ కావాలని ఆకాంక్షించిన 18 ఏళ్ల అభిజీత్ మృతదేహం కనిపించింది. 24 గంటల తరువాత 18 ఏళ్ల మనోహర్ శర్మ జెఇఇ పరీక్షలకు హాజరు కావడానికి నాలుగు రోజుల ముందు ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News