Wednesday, April 2, 2025

ట్రిపుల్ ఐటిలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ట్రిపుల్ ఐటిలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేవ్ రా్రష్ట్ర అలహాబాద్‌లో జరిగింది. తెలంగాణ చెందిన విద్యార్థి గుండె పోటుతో మృతి చెందగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార…. తెలంగాణకు అఖిల్(21), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణ(21) అలహాబాద్ ట్రిపుల్ ఐటి చదువుతున్నారు. అఖిల్ గుండెపోటుతో గత రాత్రి మృతి చెందాడు. దీంలో అఖిల్ తల్లిదండ్రులు రాజూపాయక్, దేవికి సమాచారం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు రాహుల్ చైతన్య హాస్టల్ భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాహుల్ చైతన్య గత సంవత్సరం జెఇఇలో 52వ ర్యాంకు సాధించి అలహాబాద్ ట్రిపుల్ ఐటిలో చేరాడు. ఇటీవల సెమిస్టర్ పరీక్షలు ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు అని, అఖిల్ మరణాన్ని తట్టుకోలేక రాహుల్ ఆత్మహత్య చేసుకొని ఉంటారని విద్యార్థులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్షంతోనే తమ ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారని కన్నతల్లిదండ్రులు, బంధువులు ౠరోపణలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇద్దరు మృతిపై విచారణ జరుపుఆతమని ట్రిపుల్ ఐటి అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News