- Advertisement -
కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట గ్రామంలో విద్యార్థులు రోడ్డు దాటుతుండగా ట్రాక్టర్ వేగంగా దూసుకువచ్చిన ఢీ కొట్టడంతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాళ్లు చేతులు విరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రజనీ కాంత్ అనే విద్యార్థి ఘటనా స్థలంలో మృతి చెందగా మరో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -