Wednesday, January 22, 2025

ఈత సరదా.. అమెరికాలో ఇద్దరు విద్యార్థుల మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈత సరదా.. అమెరికాలో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల ప్రాణాలు బలిగొన్నది. వివరాల్లోకి వెళ్తే..  వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన శివదత్తా, హనుమకొండలోని నక్కలగుట్టకు చెందిన ఉత్తేజ్‌ ఉన్నత విద్యాభ్యాసం కోసం కొన్నినెలల క్రితం అమెరికా వెళ్లారు. ఇద్దరూ సెయింట్‌ లూయిస్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నారు. వారాంతం కావడంతో శనివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి సెయింట్‌ లూయిస్‌ ప్రాంతంలో పార్టీ చేసుకున్నారు.

Two students died in America

ఆ తర్వాత అక్కడే ఉన్న చెరువులో సరదాగా ఈత కొట్టడానికి దిగారు. అయితే విపరీతమైన చలి ఎక్కువగా ఉండటంతో ఇద్దరు బయటకు వచ్చారు. కానీ ఉత్తేజ్‌, శివదత్త మాత్రం గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పెట్రోలింగ్ పోలీసులు సరస్సులో నుంచి శివదత్త మృతదేహాన్ని శనివారమే వెలికితీశారు. అయితే ఉత్తేజ్‌ మృతదేహం ఆదివారం రాత్రికి కానీ లభించలేదు. కాగా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులు అనుకోని ప్రమాదంలో చనిపోవడం వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News