Monday, December 23, 2024

ఎపిలోని మున్నేరులో మునిగి ఇద్దరు ఖమ్మం జిల్లా విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని మున్నేరు నీటిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. నీట మునిగి చనిపోయిన ఇద్దరు విద్యార్థులు ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి గ్రామానికి చెందినవారు. మడుపల్లి గ్రామంలోని సరస్వతీ విద్యాలయానికి చెందిన సుమారు 80 మంది విద్యార్థులు శనివారం పెనుగంచిప్రోలు మున్నేరు ఒడ్డున ఉన్న మామిడితోటలోకి పిక్నిక్ కోసం వచ్చారు. ఉదయం నుంచి వారితో వచ్చిన ఉపాధ్యాయులు ఆటపాటలతో సరదాగా గడిపారు.

సాయంత్రం నాలుగు గంటల సమయంలో నలుగురు విద్యార్థులు మున్నేరులో స్నానం చేసేందుకు దిగారు. వారిలో ఆరో తరగతి విద్యార్థి శీలం నర్సిరెడ్డి (12), నాలుగో తరగతి విద్యార్థి నీలం జస్వంత్ (10) నీటిలో మునిగి గల్లంతు అయ్యారు. విద్యార్థులు నీటిలో మునిగిన ఘటనను గమనించిన ఉపాధ్యాయులు అతి కష్టం మీద ఇద్దరు విద్యార్థులను బయటకు తీశారు. మరో ఇద్దరు మృతి చెందారు. సమీపంలో చేపలను వేటాడుతున్న జాలర్లు వచ్చి మృతదేహాలను బయటకు తీశారు. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట సిఐ, ఎస్‌ఐ, తహసీల్దార్ ఘటనా స్థలానికి వచ్చి వివరాలను తెలుసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News