Thursday, January 16, 2025

క్రికెట్ మ్యాచ్‌లో కత్తిపోట్లతో ఇద్దరు విద్యార్థుల మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబల్లపుర గ్రామంలో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తలెత్తిన ఘర్షణలో ఇద్దరు హత్యకు గురయ్యారు. పోలీస్‌ల సమాచారం ప్రకారం రెండు వర్గాల మధ్య ఘర్షణలో సెకండ్ ప్రీ యూనివర్శిటీ కాలేజీ విద్యార్థి ప్రతీక్ (17),బిఇ గ్రాడ్యుయేట్ డిఎస్ భరత్ కుమార్ (25) కత్తి పోట్లకు గురై ప్రాణాలు కోల్పోయారని పోలీస్‌లు శనివారం తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ నేత ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నేతలు కార్లతో వచ్చి మ్యాచ్‌కు అడ్డుగా పార్కింగ్ చేయడంతో వివాదం తలెత్తింది. అక్కడ నుంచి కార్లను తీసివేయాల్సిందిగా టీమ్ వారు అభ్యంతరం లేవదీయడంతో కార్లలో వచ్చిన వారు తిరస్కరించారు. దీంతో ఘర్షణ జరిగింది. మ్యాచ్ టీమ్ వారు కార్లను ధ్వంసం చేసి అద్దాలు పగుల గొట్టారు. దీంతో కార్లలోవచ్చిన వారు కత్తులు పట్టుకుని టీమ్ సభ్యులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులు హత్యకు గురయ్యారు. దాడి చేసిన నిందితులు అక్కడ నుంచి పరారయ్యారని పోలీస్‌లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News