Monday, December 23, 2024

సీతారామ కాల్వలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండల పరిధిలోని బుగ్గపాడు సీతారామ ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు విద్యార్థులు మరణించిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మడిపల్లి శ్రీనివాసరావు కుమారుడు జితేంద్ర కుమార్ (10), పామర్తి కిషోర్ కుమారుడు శశాంక్ (10) మూడో తరగతి చదువుతున్నారు. సోమవారం పాఠశాలకు సెలవు దినం కావడంతో సమీపంలో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ కాలువను చూసేందుకు వెళ్లి కాలుజారి ప్రమాదవశాత్తూ అందులో పడి మరణించారు. రెండు కుటుంబాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులిద్దరిదీ ఒకే గ్రామం కావడంతో విషాదఛాయలు నెలకొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News