- Advertisement -
భువనగిరి: భువనగిరి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో పదోతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ప్రభుత్వ వసతి గృహంలో ఊరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిననట్లు సమాచారం. వారిలో ఇద్దరు (కోడి భవ్య), (గాదె వైష్ణవి ) ఇద్దరు విద్యార్థినులు మృతి చెందగా మూడో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనని గమనించిన తోటి విద్యార్థులు 108 సహాయంతో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా వారు పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ లో పదో తరగతి చదువుతున్నట్లు సమాచారం
- Advertisement -