Wednesday, April 30, 2025

గద్వాలలో ఘోర ప్రమాదం.. విద్యార్థినులపైకి దూసుకెళ్లిన బొలేరో వాహనం

- Advertisement -
- Advertisement -

జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాలలో వేగంగా వచ్చిన ఓ బొలేరో వాహనం అదుపుతప్పి.. రోడ్డుపక్కన నిలబడి ఉన్న విద్యార్థినులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థినులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడిన వారిని చికిత్స కోసం అంబులేన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో మరణించిన విద్యార్థినుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News