- Advertisement -
హైదరాబాద్: వివాహేతర సంబంధం వదిన – మరిది ప్రాణాలు తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆర్‌ఎస్ రంగాపురం గ్రామంలో ఆశోక్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే గ్రామంలో వరసకు వదిన అయ్యే మహిళతో ఆశోక్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగడంతో పంచాయతీ పెట్టారు. పెద్ద మనుషులు ఇద్దరిని హెచ్చరించిన కూడా వారిలో మార్పు రాలేదు. అత్తింటి వారు సదరు మహిళను మందలించడంతో ఆశోక్ ఇంటికి వెళ్లింది. ఆశోక్ ఉరేసుకొని చనిపోగా ఆమె పురుగులు మందు తాగింది. స్థానికులు గమనించి వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -