Sunday, December 22, 2024

ఆర్మూర్‌లో ఎన్‌ఐఎ సోదాలు.. ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Bhoomi roundup Sun with High Speed on July 29th

మనతెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్‌లో ఇద్దరు అనుమానిత వ్యక్తులను ఎన్‌ఐఏ అధికారులు ఆదివారం అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఈక్రమంలో ఆర్మూర్ పట్టణంలోని జిరాయతనగర్‌లో స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఎ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎన్‌ఐఎ అదుపులో ఉన్న ఇద్దరి బ్యాంకు ఖాతాల్లో అనుమానిత లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. విదేశాల నుంచి ఆ ఇద్దరి బ్యాంక్ ఖాతాలకు నగదు బదలాయింపు జరిగినట్లు ఎన్‌ఐ దర్యాప్తులో తేలడంతో వారిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నిందితుల అరెస్ట్‌తో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన ఆ ఇద్దరికి ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఎన్‌ఐఏ అధికారులు విచారణ చేపడుతున్నారు.

Two Suspects Arrested by NIA in Armoor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News