కర్నూలులో ఇద్దరు టిడిపి నాయకుల దారుణ హత్య
కర్నూలు : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో గురువారం నాడు టిడిపి నాయకులు వడ్డు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి అన్నదమ్ములను అన్నదమ్ములను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపేశారు. ఈక్రమంలో అడ్డు వచ్చిన మరికొందరి కార్యకర్తలపై, వారి అనుచరులపైనా కత్తులతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి కర్నూలు జిల్లాలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో మృతులు మాజీ సర్పంచ్ ఒడ్డు నాగేశ్వర రెడ్డి, అతని తమ్ముడు, వ్యవసాయ సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిగా గుర్తించారు. శ్మశానానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. తొలుత బొలేరో వాహనాలతో ఢీకొట్టి అనంతరం వేటకొడవళ్లతో నరికి చంపేశారు. మూడు రోజుల క్రితం చనిపోయిన సమీప బంధువుకు సమాధి వద్దకు మూడు రోజుల మెతుకులు వేసేందుకు శ్మశానానికి వెళ్తుండగా కాపు కాచి ప్రత్యర్థులు హత్య చేశారు.
ప్రత్యర్థులు దాడి చేస్తుండగా అడ్డగించిన వారి అనుచచరుల పైనా దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డిలు స్పాట్‌లోనే చనిపోగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. హత్య జరిగిని తీరుపై స్థానికులను విచారిస్తున్నారు. అయితే, వీరి హత్యకు పాత కక్షలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నారు.