Thursday, January 23, 2025

ప్రేమ వ్యవహారంలో ఇద్దరు టీచర్లను కాల్చి చంపిన సహోపాధ్యాయుడు

- Advertisement -
- Advertisement -

గొడ్డా( జార్ఖండ్): జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో ఓ ప్రభుత్వ టీచర్ ఇద్దరు తోటి టీచర్లను కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. చనిపోయిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. జిల్లాలోని పొరయ్యాహట్ గ్రామంలో ఉన్న అప్‌గ్రేడ్ హైస్కూలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 11 గంటలకు పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో ఆ టీచర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.గొడ్డ ఎస్‌పి నాథూసింగ్ మీనా మీడియాతో మాట్లాడుతూ స్కూలులోని ఓ దిలో ఇద్దరి మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉండగా కనుగొన్నామని, నిందితుడు కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు గది వద్దకు పరుగెత్తుకు వెళ్లారని,

అయితే గది తలుపులు లోపలినుంచి గడియ పెట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారని ఆయన చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గది తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే తలపై తూటా గాయాలున్న ఇద్దరు కూడా చనిపోయి కనిపించచారని ఎస్‌పి చెప్పారు. నిందితుడు తన తల కుడివైపు కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఇది ప్రేమవ్యవహారంగా తెలుస్తోందని, ఇద్దరు మగటీచర్లు కూడా మహిళా టీచర్‌తో ప్రేమవ్యవహారం సాగిస్తున్నట్లు తెలుస్తోందని మీనా తెలిపారు. ఘటనా స్థలంనుంచి రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని, అయితే ఒక తుపాకీనే కాల్పుల్లో వాడినట్లు ఆయన చెప్పారు. గాయపడిన టీచర్‌ను గొడ్డా ఆస్పత్రిలో చేర్చగా, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News