- Advertisement -
శ్రీనగర్: ప్రసిద్ధ కశ్మీరీ పండిత్ కెమిస్ట్ సహా ముగ్గురు పౌరులు కశ్మీర్ లోయలో చంపబడి రెండు రోజులైనా గడవక ముందే గురువారం శ్రీనగర్ పాఠశాలలో ఇద్దరు టీచర్లను ముష్కరులు కాల్చిచంపారు. పోలీసుల కథనం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో ఈద్గా సంగంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోకి చొరబడి అతి దగ్గరి నుంచి ఇద్దరు టీచర్లను కాల్చి చంపారు. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాక చనిపోయారని ప్రకటించారని అధికారులు తెలిపారు.
చనిపోయిన ఇద్దరిలో ఒకరు స్కూల్ ప్రిన్సిపల్ సతీందర్ కౌర్, మరొకరు ఉపాధ్యాయుడు దీపక్ చాంద్‌గా గుర్తించారు. వారిద్దరూ శ్రీనగరంలోని అల్లోచ బాగ్‌లో నివసిస్తారు. దీపక్ చాంద్ కశ్మీరీ పండిత్ అని, అతడి కుటుంబం 1990 దశకంలో ప్రవాసం వెళ్లి ఇటీవలే తిరిగొచ్చిందని స్థానికులు తెలిపారు. ఈ హత్యలకు తామే బాధ్యులమని ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’(టిఆర్‌ఎఫ్)తెలిపింది.
- Advertisement -