Monday, December 23, 2024

కాల్పుల్లో ఇద్దరు విద్యార్థుల మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బే సెయింట్ లూయిస్ (మిస్సిసిపీ ) మిస్సిసిపీ గల్ఫ్ తీరం లో కిల్న్‌లో హేన్‌కాక్ హైస్కూల్ సమీపాన ఆదివారం తెల్లవారు జామున ఓ ఇంట్లో పార్టీ జరుగుతుండగా కాల్పులు జరగడంతో 18ఏళ్లు, 16 ఏళ్ల విద్యార్థులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పాస్ క్రిస్టియన్ నగరానికి చెందిన 19 ఏళ్ల కెమెరన్ ఎవరెస్ట్ బ్రాండ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సాక్షాధారాలు ఉండడంతో పోలీస్‌లు అతనిపై హత్య, ఇతర అభియోగాలు మోపారు.

పాస్ క్రిస్టియన్ నగరానికి సమీపాన తన ఇంటిలో బ్రాండ్‌ను పోలీస్‌లు అరెస్టు చేసి జైలుకు తరలించినట్టు బే సెయింట్ లూయిస్ పోలీస్ చీఫ్ టోబీ స్కార్ట్‌జ్ తెలిపారు. బే సెయింట్ లూయిస్ మున్సిపల్ కోర్టు జడ్జి స్టెఫెన్ మాగియో నిందితుడు బ్రాండ్‌కు బెయిలు మంజూరుకు తిరస్కరించారు. దాంతో బ్రాండ్‌ను హేన్‌కాక్ కౌంటీ జైలుకు తరలించారు. ఈ సంఘటనలో గాయపడిన విద్యార్థులను హెలికాప్టర్ ద్వారా ఏరియా ఆస్పత్రులకు చేర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News