Monday, January 6, 2025

థాయిలాండ్‌లో ఇద్దరు తెలంగాణ వ్యక్తులు అదృశ్యం

- Advertisement -
- Advertisement -

థాయిలాండ్‌లో తప్పిపోయిన తమ భర్తల ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ హైదరాబాద్‌లోని ప్రవాసి ప్రజావాణిలో బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా షెట్పల్లికి చెందిన శనిగరపు అరవింద్, జగిత్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన కొండ సాగర్ నవంబర్ 11న ముంబై నుంచి బ్యాంకాక్ కు వెళ్లినట్లు బాధితుల భార్యలు తెలిపారు. అయితే నవంబర్ 21 నుంచి అందుబాటులో లేకుండా పోయారని అరవింద్ భార్య జల, సాగర్ భార్య కాశమ్మ మంగళవారం హైదరాబాద్‌లో ప్రవాసి ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఓ ఏజెంట్ ద్వారా రూ.2 లక్షల చొప్పున చెల్లించి విజిట్ వీసాపై ఉద్యోగం కోసం థాయిలాండ్ వెళ్లినట్లుగా తెలిపారు. వారివెంట కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు డా. బీఎం వినోద్ కుమార్, మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News