Monday, December 23, 2024

ఉత్తరాఖండ్‌లో ఇద్దరు హైదరాబాదీ పర్యాటకుల మృతి

- Advertisement -
- Advertisement -

బద్రీనాథ్ వెళ్లివస్తుండగా బైక్‌పై పడిన బండరాళ్లు

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో శనివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మరణించారు. చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొడచరియలు విరిగిపడడంతో బండరాళ్లు మీద పడి మోటారుసైకిల్ వెళుతున్న ఇద్దరు హైదరాబాద్ పర్యాటకులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గౌచర్, కర్ణప్రయాగ్ మధ్య ఛట్వపీపల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించుకుని మోటారు సైకిల్‌పై తిరిగివస్తున్న నిర్మల్ షాహీ(36), సత్యనారాయణ(50)పై కొండపై నుంచి దొర్లిన బండరాళ్లు మీదపడ్డాయి. మట్టి చరియల కింద చిక్కుకుపోయిన వారిద్దరి మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక చోట్ల రహదారిపై కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అవరోధం ఏర్పడింది.

కామెడ, గౌచర్ మధ్య, రుద్రప్రయాగ్‌భనీర్,పని, పాగల్‌నాలా, పిలోలాతోపాటు జోషీమఠ్, బద్రీనాథ్ మధ్య తదితర డజనుకు పైగా ప్రదేశాలల వద్ద రఁహదారి ప్రయాణానికి అడ్డంకులు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, బార్టర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది రహదారులపై ఏర్పడిన అడ్డంకులను తొలగిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడిన కారణంగా రుద్రప్రయాగ్-కేదార్‌నాథ్ జాతీయ రహదారిలో కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. ముందు జాగ్రత్తగా రుద్రప్రయాగ్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నిటినీ మూసివేశారు. కుమావో, గఢ్వాల్ ప్రాంతాలలో శనివారం, ఆదివరాం రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రోజులూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జలవనరులు ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రభుత్వం సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News