Monday, December 23, 2024

అమెరికాలో జలపాతంలో పడి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికా దేశం ఆరిజోనా ప్రాంతంలోని ఫాజిల్ క్రీక్ జలపాతంలో పడి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. ఖమ్మం జిల్లాకు చెందిన లక్కిరెడ్డి రాకేశ్ రెడ్డి(26), రోహిత్ మణికంఠ రేపాల(25) ఇద్దరు అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి పట్టా అందుకున్నారు. ఈ శుభ సందర్భంగా 16 మంది స్నేహితులతో కలిసి గత బుధవారం ఫాజిల్ క్రీక్ జలపాతం వద్దకు వెళ్లారు. జలపాతంలో రాకేశ్ రెడ్డి, రోహిత్ కాలుజారి ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. స్నేహితులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు గత మూడు రోజుల నుంచి గత ఈతగాళ్ల సహాయంతో వెతికారు. శనివారం రాత్రి 25 అడుగుల లోపల ఇద్దరు మృతదేహాలను పోలీసులు గుర్తించి బయటకు తీశారు. తెలంగాణ నారాయణ పాఠశాలల అధినేతల్లో ఒకరైన లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పద్మ దంపతుల ఏకైక తనయుడు రాకేశ్ రెడ్డి. కుమారుడు విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ పట్టా తీసుకున్న సందర్భంగా తల్లిదండ్రులు కూడా అమెరికాకు వెళ్లారు. తల్లిదండ్రులు అమెరికాలో ఉండగానే కుమారుడు చనిపోవడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పుడు వారు కుమారుడి శవంతో ఇండియాకు తరలివస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News