Monday, December 23, 2024

బారాముల్లాలో ఎన్‌కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

బారాముల్లా: జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా వాంగిమ్ పయీన్ క్రీరి ప్రాంతంలో గురువారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తనిఖీలు చేస్తున్న బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఇద్దరు తీవ్రవాదులు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి మందు గుండు సామాగ్రి, ఎకె 47 రైఫిళ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. లష్కరే తోయిబా తీవ్ర వాద సంస్థకు చెందిన షకీర్ మజీద్ నజర్, హనన్ అహ్మద్ సేహ గుర్తించినట్టు సమాచారం. బుధవారం కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ ఇద్దరు తీవ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.

Also Read: యూట్యూబ్ కోసం 300 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ… ప్రొఫెషనల్ బైకర్ మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News